Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టులు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను అంతరిక్షంలో అభివృద్ధి చేశారు. ఈ అధ్యయనం ద్వారా మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం సూచిస్తోందని సైంటిస్టులు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ తెరుహికో వాకయామా మరియు జపాన్ ఏరోస్పేస్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) బృందం ఈ పరిశోధనను చేసింది. దీని కోసం ఆగస్టు 2021లో రాకెట్ ద్వారా గడ్డకట్టిన స్ఠితిలో ఎలుక పిండాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి…
Kerala Bomb Blasts: కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Donald Trump: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదులతో సమావేశమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం లాస్ వేగాస్ లో రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు తిగిరి ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్‌ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులను మన దేశం నుంచి బయటకు రానీయకుండా చూస్తానని అన్నారు.
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. తాజాగా నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే అది నాలుగేళ్ల గందరగోళం, ప్రతీకారాలు, నాటకీయత కావచ్చని, అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించగలదని ఆమె విమర్శించారు. దేశాన్ని నిలబెట్టే కెప్టెన్ అవసరమని, నావ మునిగిపోదని…
Delivery Boy: నోయిడాలో దారుణం జరిగింది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్, ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు లొంగిపోతున్నట్లు నటిస్తూ.. పిస్టల్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు అతికష్టం మీద నిందితుడి కాలుపై ఫైర్ చేసి పట్టుకున్నారు.
Kerala serial blasts: కేరళలో ఆదివారం జరిగిన వరస పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటికే ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కలమస్సేరిలో జరిగే ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల కేరళలో పాలస్తీనా, హమాస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల అనంతం పేలుళ్లు సంభవించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
Kerala Bomb Blast: కేరళలో వరస పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్‌లో ఉన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండగ సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచులన నిర్వహణ నేపథ్యంలో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే వరసగా మూడు పేలుళ్లు జరిగాయి.
Israel-Turkey: టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా వేల మంది జనాలతో అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించారు. వేల మంది సాక్షిగా ఇజ్రాయిల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయిల్ గత 22 రోజులుగా బహిరంగ యుద్ద నేరాలకు పాల్పడుతోందని, అయితే పాశ్చాత్య నాయకులు కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వలేదని ఎర్డోగాన్ అన్నారు.
Onion Export: పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై శనివారం ఆంక్షలు విధించింది. సరఫరా, ధరలపై ఒత్తిడి మధ్య కూరగాయల విదేశీ ఎగుమతులపై కనిష్ట ధరను నిర్ణయించింది. కనిష్ట ఎగుమతి ధర(MEP) టన్నుకు 800 డాలర్లగా అక్టోబర్ 29 నుంచి అమలులోకి వస్తుందని,