Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. తాజాగా నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే అది నాలుగేళ్ల గందరగోళం, ప్రతీకారాలు, నాటకీయత కావచ్చని, అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించగలదని ఆమె విమర్శించారు. దేశాన్ని నిలబెట్టే కెప్టెన్ అవసరమని, నావ మునిగిపోదని నిక్కీహేలీ అన్నారు.
Read Also: Vishwak Sen: వైరల్ అయిన ఆ ట్వ్వీట్ ను డిలీట్ చేసిన విశ్వక్ సేన్..కారణం అదేనా..?
ఇజ్రాయిల్ పక్షాన నిలబడ్డందుకు ట్రంప్ ను కొనియాడినప్పటికీ.. అతను భవిష్యత్తులో ఏం చేస్తాడనేదే ప్రశ్న అని, డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ అనుకూల అధ్యక్షుడని చర్రిత నమోదు చేస్తుంది. ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలగడం తప్పనిసరి. జెరూసలేంని ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించడం రైట్ అని, ఈ విషయంలో ఆయనకు క్రెడిట్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని యూదులను ఉద్దేశించి తన ప్రసంగంలో అన్నారు.
ఇజ్రాయిల్-హమాస్, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హింసను ప్రస్తావించిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీహేలీ ప్రపంచం మంటల్లో ఉందని అన్నారు. అమెరికాకు ఓడ మునిగిపోకుండా నిలబెట్టే కెప్టెన్ కావాలని, రిపబ్లికన్లలో గెలవగల అభ్యర్థి కావాలని నిక్కీహేలి అన్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్ జోబైడెన్ మరోసారి ఎన్నిక కావడాన్ని అమెరికా ప్రజలు భరించలేరని ఆమె అన్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టింది నిక్కీహేలి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూను విమర్శిస్తూ.. యాంటీ ఇజ్రాయిల్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాని ట్రంప్ తెలివైనదిగా పొగడటాన్ని తప్పుపట్టారు. ‘‘నేను హిజ్బుల్లాను అభినందించను, యుధ్యం మధ్యలో విషాదంలో ఉన్న ఇజ్రాయిల్ ప్రధానిని విమర్శించను’’ అని ఆమె అన్నారు.