Kerala Bomb Blasts: పేలుళ్లకు నాదే బాధ్యత.. పోలీసుల ముందు లొంగిపోయిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Bomb Blasts: కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: Donald Trump: అధికారంలోకి వస్తే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తా..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఈ కేసులో సంచలనం నమోదైంది. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్‌లో కేరళ పోలీసుల ముందు లొంగిపోయారు. అనుమానితుడిని డొమినిక్ మార్టిన్ గా గుర్తించారు. పార్థనా సమావేశాన్ని నిర్వహిస్తున్న అదే క్రైస్తవ వర్గానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, హాల్ మధ్యలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు.
అయితే ఈ పేలుళ్ల వెనక అతని హస్తం ఉందా.. లేదా.. అనే విషయాలను పోలీసులు ఇంకా నిర్థారించలేదు. లొంగిపోయిన వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలను ఐఈడీగా గుర్తించారు.వీటిని టిఫిన్స్ బాక్సుల్లో పెట్టి పేల్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ రేపు 10 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
#WATCH | On the blast at Zamra International Convention & Exhibition Centre, Kalamassery, Kerala ADGP (law and order) MR Ajith Kumar, says "One person has surrendered in Kodakra Police Station, in Thrissur Rural, claiming that he has done it. His name is Dominic Martin and he… pic.twitter.com/q59H7TaQC7
— ANI (@ANI) October 29, 2023
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!