Foxsky Full HD Smart LED TV: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఓ అదిరిపోయే డీల్ మీకోసం. ఫాక్స్ స్కై (Foxsky) 108 సెం.మీ (43 అంగుళాల) ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ (43FS-VS)పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.41,499గా ఉన్న ఈ టీవీని ప్రస్తుతం కేవలం రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, EMI సదుపాయం కూడా రూ.600 నుంచి ప్రారంభం అవుతోంది. మరి ఇంత తక్కువ ధరలో ఎలాంటి ఫీచర్లను ఇస్తున్నారో ఒకసారి చూద్దామా..
7000mAh బ్యాటరీ, 200MP డ్యూయల్ కెమెరాల.. స్నాప్‌డ్రాగన్ 8 Elite Gen 5తో Vivo X300 Ultra..
ఈ స్మార్ట్ టీవీకి అమెజాన్‌లో ‘అమెజాన్స్ ఛాయస్’ ట్యాగ్ ఉంది. ఈ టీవీలో 43 అంగుళాల Full HD (1920 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ LED డిస్‌ప్లే ఉంది. ఇది 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 4000:1 కాంట్రాస్ట్ రేషియో, అల్ట్రా బ్రైట్‌నెస్, HDR-10 సపోర్ట్, వైడ్ కలర్ గ్యామట్ ఉండడంతో సినిమాలు, టీవీ షోలు స్పష్టంగా కనిపిస్తాయి.

Foxsky 43FS-VS టీవీ Android OSపై పనిచేస్తుంది. ఇందులో యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి ప్రముఖ యాప్స్‌కు సపోర్ట్ ఉంది. గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్ ఇవ్వబడింది. అలాగే నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ కోసం ప్రత్యేక హాట్‌కీలు ఉన్నాయి. ఈ టీవీలో 30W DTS సరౌండ్ సౌండ్ స్పీకర్లు ఉన్నాయి. సినిమా, మ్యూజిక్, స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు మంచి ఆడియో అనుభూతిని ఇస్తాయి. 60Hz రిఫ్రెష్ రేట్‌తో సాధారణ వినియోగానికి సరిపడే పనితీరు అందిస్తుంది.
Vaikuntha Ekadashi: తెలంగాణలో మార్మోగుతున్న ‘గోవింద’ నామస్మరణ.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
ఇందులో 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 2 USB పోర్ట్స్, HDMI, Wi-Fi కనెక్టివిటీ, గేమింగ్ కన్సోల్‌కు కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఈ టీవీ పూర్తిగా భారత్‌లోనే తయారైంది. రూ.15,000లోపే ఒక 43 అంగుళాల ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆఫర్.