Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్‌నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే వరసగా మూడు పేలుళ్లు జరిగాయి.
Read Also: Minister KTR : కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు
పేలుళ్ల సమయంలో ప్రార్థనల్లో 2000 మంది ఉన్నారు. మొదటి పేలుడు 9.47 గంటలకు చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ని ఉపయోగించారని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ పోలీసులు తెలిపారు.పేలుడు పదార్థాలను టిఫిన్ బాక్స్‌లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు కేరళకు చేరింది. ఈ పేలుడు దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. పేలుళ్ల తర్వాత విధులకు హాజరు కావాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రభుత్వ ఆరోగ్య నిపుణులను కోరారు.పేలుళ్లపై హోంమంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడారు.