Onion Export: ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Export: పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై శనివారం ఆంక్షలు విధించింది. సరఫరా, ధరలపై ఒత్తిడి మధ్య కూరగాయల విదేశీ ఎగుమతులపై కనిష్ట ధరను నిర్ణయించింది. కనిష్ట ఎగుమతి ధర(MEP) టన్నుకు 800 డాలర్లగా అక్టోబర్ 29 నుంచి అమలులోకి వస్తుందని, డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ తెలిపింది. MEP అనేది చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అడ్డుకునేందుకు నిర్ణయించే ధర. ఈ ధర వల్ల ప్రపంచ కొనుగోలుదారులకు విక్రయించలేరు. ఫలితంగా దేశీయంగా ఉల్లిపాయల లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: USA: శృంగారం తర్వాత పురుషులను హత్య చేస్తున్న మహిళ.. చివరకు చిక్కింది..
Also Read
ప్రస్తుత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరలు రెండింతలయ్యాయి. ఢిల్లీలో ఒక వారం క్రితం రూ. 25-30 మధ్య ఉన్న రేట్లు ఇప్పుడు రూ. 50-60కి చేరింది. బఫర్ స్టాక్ ద్వారా అదనంగా 2,00,000 టన్నుల ఉల్లిపాయలను సేకరిస్తామని శనివారం ప్రభుత్వం తెలిపింది. దీని కోసం ఇప్పటికే 5 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ధరలు అధికంగా ఉన్న 16 నగరాల్లో ప్రభుత్వం ఉల్లిపాయల్ని విక్రయిస్తుందని అధికారులు తెలిపారు. పండగ సీజన్ లో సరఫరా తక్కువగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉల్లిపాయల అఖిల భారత సగటు రిటైల్ ధర 57 శాతం పెరిగి కిలోకు 47 రూపాయలకు చేరిన నేపథ్యంలో రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయల విక్రయాన్ని సబ్సిడీపై కిలోకు 25 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో కిలో ఉల్లి ధర రూ. 30గా ఉంది. ఈ ఏడాది ప్రతీకూల వాతావరణ పరిస్థితులతో ఖరీఫ్ లో ఉల్లి నాట్లు ఆలస్యం కావడంతో పంట రాక ఆలస్యం అయింది. దీంతో ధరల పెరుగుదలకు దారి తీసింది.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!