Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ పోరాటం తీవ్ర యుద్ధంగా మారుతోంది. ఈ యుద్ధంపై ఇప్పటికే అరబ్, ముస్లిం దేశాలు తమ ఆందోళనను వ్యక్తపరిచాయి. అయితే ఇరాన్‌తో సహా పలు అరబ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ఓ వైపు గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీ రెబల్స్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Road Accidents: ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, చాలా సందర్భాల్లో రోడ్ల పరిస్థితులు సరిగా లేకపోవడం, ఓవర్ స్పీడ్, వాహనదారుల అజాగ్రత్త ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. తాజాగా రోడ్డు రవాణా మంత్రి శాఖ వెల్లడించిన నివేదికలో ఇండియా వ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తేలింది.
Pig Heart Transplant: మానవులకు అవయవాలు పాడైతే, వేరే వాళ్లు దానం చేయడమో లేకపోతే మరణించడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు అమర్చుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి పంది కిడ్నీని, మరొక వ్యక్తి పంది గుండెను అమర్చారు. అయితే ప్రారంభ రోజుల్లో సదరు రోగులు బాగానే ఉన్నా తర్వాత మానవ శరీర వ్యవస్థ వాటిని తిరస్కరించడంతో మరణించారు. అయితే కొన్ని రోజుల…
Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Survival Story: మహా సముద్రంతో తప్పిపోవడం అంటే చావుకు దగ్గర కావడమే, ఇలా ఎంతో మంది మరణించారు. అయితే కొందరు మాత్రం ప్రాణంపై ఆశ వదలకుండా కొన్ని నెలల పాటు సముద్రంలో లేకపోతే దిక్కులేని ద్వీపాల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. మనుగడ కోసం వారి పోరాటమే వారిని కాపాడింది. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.
Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యెహోవా విట్నెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Israel PM: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ హమాస్ దాడి గురించిన వివరాలు ముందుగా రాకపోవడంపై అందర్ని ఆశ్చర్యపరిచింది. ఎక్కడా కూడా విషయం బయటకు పొక్కకుండా హమాస్ దాడి చేసింది.
Bihar: బీహార్ రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో ఒక వ్యక్తి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. నర్హత్ గ్రామంలోని కాంగ్రెస్ నేత నీతూ కుమార్ ఇంట్లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు పీయూష్ సింగ్ గా గుర్తించారు. డెడ్ బాడీ దొరికిన సమయంలో ఎమ్మెల్యే నీతూ కుమార్ ఇంట్లో లేరని తెలిపారు.
శ్రీనగర్ లోని ఈద్గా సమీపంలో ఉగ్రవాదులు ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై కాల్పులు జరిపి గాయపరిచారు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు. ప్రస్తుతం పోలీస్ అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.