Vivo Y31d: వివో (Vivo) తన కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo Y31d లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. వియత్నాంలో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ యూరోఫిన్స్ (Eurofins) సర్టిఫికేషన్ కనిపించగా.. తాజాగా వివో సోషల్ మీడియా ద్వారా టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ Y31d వేరియంట్ భారత్‌కు వచ్చే అవకాశం తక్కువగా ఉందని సమాచారం.
Bengaluru: కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
Vivo Y31d ముఖ్య ఫీచర్లు (అంచనా):
టీజర్ ప్రకారం ఈ Vivo Y31d లో భారీ 7,200mAh BlueVolt బ్యాటరీ ఇవ్వనున్నారు. దీనికి రేటెడ్ కెపాసిటీ 7,060mAhగా ఉంటుంది. అలాగే 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. డ్యూరబిలిటీ విషయంలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. Vivo Y31d కు IP69+ డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, SGS 5-స్టార్ ప్రీమియం స్టాండర్డ్ సర్టిఫికేషన్, MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ప్రమాణాలు ఉన్నట్లు కంపెనీ నిర్ధారించింది.ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6 తో రానుంది.
Zepto, Blinkit, Flipkartలకు షాక్.. సమ్మె చేయనున్న గిగ్ వర్కర్స్..!
టీజర్ చిత్రంలో ఫోన్ డిజైన్ కూడా కనిపించింది. వెనుక భాగంలో ప్యాటర్న్ ఫినిష్ ఉండగా, స్క్విర్‌కిల్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్ ఇవ్వనున్నారు. ఇందులో రెండు కెమెరా సెన్సర్లు, LED ఫ్లాష్, రింగ్ లైట్ ఉండనున్నాయి. కెమెరా స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్‌లో Snapdragon 685 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.ఈ మొబైల్ జనవరిలో లాంచ్ కావొచ్చు. అయితే ఇది భారత్‌లో విడుదల కాకపోవచ్చని సమాచారం. వియత్నాం తప్ప ఇతర దేశాల లాంచ్‌పై వివో అధికారిక సమాచారం ఇవ్వలేదు.