Delivery Boy: నోయిడాలో దారుణం జరిగింది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్, ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు లొంగిపోతున్నట్లు నటిస్తూ.. పిస్టల్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు అతికష్టం మీద నిందితుడి కాలిపై ఫైర్ చేసి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ లో బాధిత మహిళ నివాసం ఉంటుంది. ఇంటికి అవసరమైన సరకలను ఆమె ఓ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టింది. నిందితుడు సుమిత్ సింగ్(23) సరుకులను డెలివరీ చేయడానికి మహిళ ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో మహిళ ఒంటరిగా ఉండటం గమనించి, బలవంతంగా లోపలకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం జరగ్గా, అదే రోజు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Kerala serial blasts: “కాంగ్రెస్, సీపీఎం బుజ్జగింపు రాజకీయాల ఫలితం”.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు సుమిత్ సింగ్ ని గ్రేటర్ నోయిడాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు చిక్కినట్టే చిక్కి, కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని వెళ్లాడు. ఈ ప్రాంతంలో సుమిత్ ని పట్టుకునేందుకు SWAT బృందాలను రప్పించారు. పోలీస్ బృందాలు నిందితుడి వద్దకు రాగానే కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతని కాలికి బుల్లెట్ తగిలింది. సుమిత్ ని ప్రస్తుతం అరెస్ట్ చేసిన పోలీసులు, అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో అక్రమ మద్యం కేసులో కూడా ఇతను పట్టుబడ్డాడు.