PAN–Aadhaar Linking Deadline: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయాలి. ఈ లింకింగ్ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవడానికి ఇవాళే ఆఖరురోజు. ఈ గడువు దాటితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవు. నిర్ణీత గడువులోగా లింక్ చేయకపోతే పాన్ కార్డ్ సేవల్లో అంతరాయం ఏర్పడటం గానీ, ఆర్థిక లావాదేవీల నిలుపుదల, ఇతర సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ వుంది.
Read Also: Tollywood : 2025 ప్లాప్ హీరోయిన్స్ వీరే.. వచ్చే ఏడాదైనా హిట్ అందుకుంటారా ?
అక్టోబర్ 1, 2024న లేదా ఆ తరువాత పాన్ కార్డులు పొందిన వారు డిసెంబర్ 31, 2025 లోపు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీ కంటే ముందుగా పాన్ కార్డ్ తీసుకున్న వారికి లింక్ కోసం గడువును మే 31, 2024 వరకు మాత్రమే ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఆధార్-పాన్ కార్డు లింక్ చేయకపోవడం ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిపివేయడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి యాక్సెస్ ఉండదు. అలాగే గడువు ముగిసిన తరువాత పాన్-ఆధార్ లింక్ చేయడానికి రూ. 1000 ఛార్జీ చేస్తారు. గడువులోగా లింక్ చేసుకోవడానికయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
నిర్ణీత గడువులోగా పాన్ కార్డ్-ఆధార్ కార్డు లింక్ చేయకపోతే.. ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం కష్టమవుతుంది. రిఫండ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది. పన్ను చెల్లింపులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమవుతాయి. టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అలాగే, పన్ను చెల్లింపుదారులు ఫామ్ 26ఏఎస్ కు యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్ పొందడంలో కష్టం.. బ్యాంకింగ్ పనులు, ఆర్థిక లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.. అయితే, గతంలో పలు మార్లు.. పాన్ – ఆధార్ లింక్ గడువునూ పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం.. గతంలో వెయ్యి రూపాయల ఫైన్‌ను ప్రకటించినా.. ఆ తర్వాత దానిని కూడా వాయిదా వేసింది.. అయితే, గడువు ఇవాళ్టితో ముగియనుండడంతో.. మరోసారి.. పాన్ – ఆధార్ లింక్ గడువు పొడిగిస్తారా? అని ఇప్పటికీ ఈ ప్రాసెస్ చేయనివారు ఎదురుచూస్తూనే ఉన్నారు.. మరి, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..