Gambling: జూదంలో భార్యను తాకట్టు పెట్టిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి మహిళ అత్తామామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనికి తోడు బాధిత మహిళ భర్త జూదానికి అలవాటు పడి తరుచుగా డబ్బులు డిమాండ్ చేసే వాడు. జూదం కోసం రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒకసారి భర్తతో పాటు మహిళ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ భార్యను పణంగా పెట్టి జూదం ఆడి ఓడిపోయాడు. ఇక చేసేదేం లేక ఆమెను అక్కడి వదిలేసి సొంతూరు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఢిల్లీలో రక్షించాడు. అయితే ఇలా ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆరు నెలల క్రితం అత్తామామలు ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా భావించిన మరిది ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక మహిళ ఎస్పీ అనుపమ్ సింగ్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు 9 మందిపై వరకట్న వేధింపులు, దాడి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?