దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు టటియానా ష్లోస్‌బర్గ్ (35) హఠాన్మరణం చెందింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని జేఎఫ్‌కే లైబ్రరీ ఫౌండేషన్ ధృవీకరించింది. తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాతో చనిపోయినట్లుగా పేర్కొంది. రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మే 2024లో తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
బయోడేటా.. కెరీర్..
ష్లోస్‌బర్గ్‌కు భర్త జార్జ్ మోరన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగింది. కరోలిన్ కెన్నెడీ- ఎడ్విన్ ష్లోస్‌బర్గ్ దంపతులకు జన్మించింది. జాకీ-జాన్ ఎఫ్. కెన్నెడీల మనవరాలు. యేల్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పు, సైన్స్ జర్నలిజంపై విద్యను అభ్యసించింది.
పర్యావరణ జర్నలిస్ట్‌గా, రచయిత్రిగా కెరీర్ ప్రారంభించింది. ది న్యూయార్క్ టైమ్స్‌లో సైన్స్, క్లైమేట్ రిపోర్టర్‌గా పనిచేశారు. కెరీర్‌లో ది వాషింగ్టన్ పోస్ట్, వానిటీ ఫెయిర్, ది అట్లాంటిక్, బ్లూమ్‌బెర్గ్‌లకు వార్తలు అందించారు. ఇక 2019లో ది ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ యు డోంట్ నో యు హావ్ అనే పుస్తకాన్ని ప్రచురించింది.
ఇది కూడా చదవండి: US: కోర్టు సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష
2023లో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నవంబర్ 2025లో ది న్యూయార్కర్‌లో ప్రచురితమైన వ్యాసంలో తనకు క్యాన్సర్ ఉన్నట్లుగా బహిరంగంగా పంచుకుంది. అనారోగ్యం, సుదీర్ఘంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు కుటుంబం అందించిన మద్దతును గుర్తుచేశారు.