Delhi High Court: అత్యాచారం చేసి బాధితురాలని పెళ్లి చేసుకున్నంత మాత్రాన కేసును మూసేయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: మైనర్‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని, అతనిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని హైకోర్టు పేర్కొంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ప్రస్తావించారు.
Read Also: Dhanush: మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్.. ధనుష్ ఖాతాలో మరో రికార్డ్
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ఈ కేసులో 16 ఏళ్ల బాలికతో నిందితుడి చాలాసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అతని కారణంగా గర్భవతి అయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు, సదరు బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ రద్దు చేయబడదని, ప్రస్తుతం ఈ కేసులో సెక్షన్ 376 ఐపీసీ, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసులు నమోదయ్యాయి. ఇవి నేర తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నాయని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది.
ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బాధితురాలు తన ఇష్టానుసారం అతడిని పెళ్లి చేసుకున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ నిందితుడు వేసిన పిటిషన్‌ని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నేరాలు నాన్-కాంపౌండబుల్ నేరాలు అని తెలిపింది. కాంపౌండబుల్ నేరాలు అంటే ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేరాలు సమాజానికి విరుద్ధమని, రాజీ కుదిరితే వాటిని కొట్టివేయలేమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని నిందితుడి పిటిషన్‌ని కొట్టేసింది. నేర తీవ్రత దృష్ట్యా వాటిని రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!