Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ ఇంజామ్ ఉల్ హక్, హర్భజన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ తో భారత్ సిరీస్‌లో మౌలానా తారిఖ్ జమీల్ చెప్పిన మాటలు విని హర్బజన్ సింగ్ ఇస్లాంలోకి మారేందుకు సిద్ధమయ్యాడని, అతను ఇస్లాంను కప్పిపుచ్చుకోవాలని అనుకుంటున్నాడని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంజమామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై హర్భజన్ సింగ్ ఘాటుగానే స్పందించారు. ఇంజమామ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతన్ని ఎవరైనా డాక్టర్ వద్దకు తీసుకెళ్లాని చెప్పారు. దయచేసి అతడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి, అతను తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, నేను సిక్కును, నేను సిక్కు కుటుంబంలో జన్మించినందుకు సంతోషంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
Read Also: Bigg Boss : కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ తనీషాపై పోలీస్ కేసు..
అతను మీడియా ముందు డ్రామాలు ఆడుతున్నారు, అతను ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇవాలనుకున్నాడో తెలియదని, అతను ఏమి డ్రింక్ చేస్తాడో, ఏం స్మోక్ చేస్తాడో తెలియని, తాగిన మత్తులో మరుసటి రోజు ఉదయం అతని ఏం గుర్తుండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఓ ట్వీట్ లో హర్భజన్.. తాను ఇండియన్‌గా, సిక్కుగా గర్విస్తున్నా అని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా చీప్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ రాజీనామా చేశారు.