Vaishnavi Sharma: కుర్రాళ్ల మనసు కొల్లగొడుతున్న కొత్త టీమిండియా బౌలర్.. సరికొత్త క్రష్ అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishnavi Sharma: భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో కొత్త తార పరిచయమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అంతర్జాతీయ అరంగ్రేటంతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైష్ణవి, తన లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పుగా మారింది. మైదానంలో బంతితో మెప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కొందరు అభిమానులు ఆమెను “సరికొత్త క్రష్” అంటూ కొనియాడుతుండగా.. మరికొందరు అందంలో ‘స్మృతి మంధాన’కు కాంపిటిషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి శర్మ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడింది. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేస్తూ తన స్థిరత్వాన్ని చాటింది. మొత్తం 19 ఓవర్లు బౌలింగ్ చేసి 119 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. వైష్ణవి బౌలింగ్ సగటు 23.80, ఎకానమీ రేట్ 6.26, స్ట్రైక్ రేట్ 22.8గా ఉండటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ప్లేయర్ కు ఇవి మంచి గణాంకాలే. ఇక లక్ష్య ఛేదన సమయంలో వైష్ణవి మరింత ప్రభావవంతంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆమె బౌలింగ్ సగటు 19.00, స్ట్రైక్ రేట్ 16.0గా ఉండటం విశేషం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ఆమె బంతితో ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలదో ఈ గణాంకాలే నిదర్శనం.
Trivikram Srinivas: మొదటి రోజు నెగటివ్ టాక్.. అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చిన త్రివిక్రమ్!
ఇప్పటివరకు టీ20ల్లో మాత్రమే అవకాశాలు దక్కినా, వైష్ణవి శర్మ ప్రదర్శనను చూస్తే భారత మహిళల జట్టుకు ఆమె దీర్ఘకాలిక ఆస్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో కూడిన స్పిన్, లైన్-లెంగ్త్‌పై పట్టు, ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయగలగడం ఆమె బలాలు. సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతున్నా, మైదానంలో మాత్రం పూర్తిగా ఆటపై దృష్టి పెట్టిన వైష్ణవి శర్మ… రాబోయే రోజుల్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుంది.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!