Snake Robot: నాసా.. అమెరికా అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం అనేక దేశాలతో పోలిస్తే నాసా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుంది. ఆర్టిమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధమౌతోంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంగారకుడి పైకి కూడా మానవ సహిత యాత్రలను నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు భారత్‌కి చెందిన వారితో పాటు, ఇండో-అమెరికన్లు చాలా మందే ఉన్నారు. భారత శాస్త్రవేత్తలకు ఎప్పుడూ కూడా నాసా రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంది. టాలెంట్ ఉన్న సైంటిస్టులకు ఆకర్షణీయమైన అవకాశాలు అందిస్తోంది.
తాజాగా చంద్రుడు, అంగారకుడిపై అన్వేషించడానికి, తనంతట తానే పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన పామును పోలి ఉన్న ఓ రోజును నాసా పరీక్షిస్తోంది. కొండ చిలువ ఆకారంలో ఉన్న ఈ రోబో భవిష్యత్తులో లూనార్, మార్స్ ఉపరితలాలపై అణ్వేషణల కోసం పంపే అవకాశం ఉంది.
ఈ స్నేక్ రోబోటో వెనక ఉన్న వ్యక్తి మాత్రం మన భారతీయుడే కావడం విశేషం. భారతీయ యువ శాస్త్రవేత్త దీన్ని రూపొందించారు. నాగ్‌పూర్‌లో చదువకుకున్న రోహన్ థాకర్ అనే యంగ్ మాస్టర్ మైండ్ ఇప్పుడు నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీలో పనిచేస్తున్నారు. పాము ఆకారంలో ఉన్న ఈ రోబోకు ఈఈఎల్ఎస్(ఎక్సోబయాలజీ ఎక్స్‌టాంట్ లైఫ్ సర్వేయర్) అని పేరు పెట్టారు.
EELS చాలా తెలివైనదని, కఠినమైన భూభాగాల్లో కూడా ఇది పనిచేస్తుందని, ఇది పగుళ్లు, గుహల్లో అన్వేషించడంతో పాటు నీటి అడుగులో కూడా ఈత కొట్టగలదని రోహన్ థాకర్ ఓ జాతీయ మీడియాకు కాలిఫోర్నియాలో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మార్స్ భూభాగంతో పాటు హిమనీనదాలపై కూడా పనిచేస్తుందని, విపత్తుల సమయంలో రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లలో పనిచేస్తుందని తెలిపారు.
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VNIT) నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఇంజనీరింగ్ చేసిన థాకర్, NASA కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించిన ఐఐటీ విద్యార్థి బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు చెప్పారు. తాను బ్యాడ్ స్టూడెంట్‌ని అని, ఐఐటీలో చేరడంలో విఫలం అయ్యాను కానీ.. నాసాలో మాత్రం చేరాను అని చెప్పారు. ఇటీవల చంద్రయాన్-3 మిషన్ లో చంద్రుడిపై ల్యాండ్ కావడం క్రికెట్ మ్యాచ్ లాంటి అనుభవాన్ని ఇచ్చిందని, ఇది తనకు కూడా గర్వకారణమైన క్షణమని రోహన్ థాకర్ అన్నారు.
Clowns: "NASA doesn't innovate"
JPL: "My dudes, we built a robot snake to explore a Saturnian ice moon"pic.twitter.com/ZxXkxSU8YW
— Chris Combs (iterative design enjoyer) (@DrChrisCombs) May 9, 2023