Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నుంచి బందీలను తిరిగి తీసుకురావడంలో మేము పురోగతి సాధిస్తున్నామని మంగళవారం చెప్పారు. ‘‘త్వరలోనే శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఉత్తరాన ఉన్న సైనిక స్థావరాన్ని సందర్శించిన సమయంలో సైనికులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మా బందీల విదులకు సంబంధించిన పరిణామా దృష్ట్యా మంగళవారం సాయంత్రం వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ మరియు ప్రభుత్వం వరసగా సమావేశం కానున్నాయి’’ అని కొద్దిసేపటి తర్వాత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Read Also: National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..
అక్టోబర్7 నాడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. 240 మంది ఇజ్రాయిలీ పౌరులను కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ స్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది సాధారణ పౌరులు మరణించారు. తాజాగా బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఖతార్ తో పాటు హమాస్ అధిపతి కూడా వెల్లడించాడు.
ఇదిలా ఉంటే తాజాగా చేసిన నెతన్యాహు వ్యాఖ్యల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావించలేదు. ‘‘మేము భద్రతను పునరుద్ధరించాలనుకుంటున్నాము. మేము చర్యలు తీసుకుంటాము. దక్షిణం, ఉత్తరం రెండింటిపై భద్రతను పెంచుతాము’’ అని అన్నారు. ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దు్ల్లో పోరాడుతున్న సైనికులకు వందనం చేయాలనుకున్నానని నెతన్యాహు అన్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!