NCERT: పాఠ్యపుస్తకాల్లో ఇటీవల కాలంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కీలక సిఫార్సులను చేస్తోంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పాఠశాలల్లోని తరగతి గదులపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషాల్లో రాయాలని సూచించినట్లు ఎన్‌సీఈఆర్టీ కమిటీ సూచించిటన్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలను నివేదించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన కమిటీ పాఠ్యపుస్తకాల్లో మార్పులను ప్రతిపాదించినట్లు కథనాల్లో వెల్లడించాయి.
Read Also: Jagdishwar Goud: శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యేగా గెలుపు నాదే.. కాంగ్రెస్ వైపే ప్రజలు
ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని చరిత్ర మూడు భాగాలుగా.. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా ఉంది. దీన్ని నాలుగు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించింది. ఇందులో క్లాసిక్ పీరియడ్, మధ్యయుగం, బ్రిటీష్ కాలం, ఆధునిక భారతంగా నాలుగు భాగాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం ఈ క్లాసిక్ పీరియడ్‌లో భాగంగా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు, పురాళణాలను చేర్చాలని, రాముడంటే ఎవరు..?, ఆయన ఉద్దేశాలేమిటి.? అనే వాటిని విద్యార్థులు తెలుసుకోవాలి, ఇతిహాసాల గురించి విద్యార్థులకు కొంతైన అవగాహాన ఉండాలని ఈ కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో రాజ్యంగ పీఠికను తరగతి గోడలపై రాయాలని కమిటీ సూచించింది. దీంతో పాటు చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలనకు గురించి, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫారసులు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్ పేరును చేర్చాలని కూడా సిఫారసు చేసింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సిఫారసులపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ రూపకల్పన జరుగుతోందని, అయితే వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని తెలిపింది. ప్యానెల్ సిఫారసుకు ఇంకా ఎన్సీఈఆర్టీ నుంచి ఆమోదం లభించలేదు.