Tinder Date: టిండర్‌లో పరిచయం చివరకు హత్యకు దారి తీసింది. అబద్ధాలపై ఏర్పడిన ఇద్దరి మధ్య బంధం హత్యకు పురిగొల్పాయి. ప్రేయసిగా నటించి ఓ వ్యక్తిని చంపిన సంఘటన 2018లో జైపూర్‌లో జరిగింది. 28 ఏళ్ల దుష్యంత్ శర్మ, 27 ఏళ్ల ప్రియాసేథ్ అనే అమ్మాయితో టిండర్‌లో పరిచయమైంది. ఇద్దరి అభిరుచులు కలవడంతో మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ఇద్దరూ వ్యక్తిగతంగా కలవాలనుకున్నారు. ప్రియాసేథ్ తన ఇంటికి ఆహ్వానించడంతో వెనకాముందు ఆలోచించకుండా దుష్యంత్ అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది, తను కిడ్నాప్ అయ్యానని, చివరకు డబ్బుల కోసం దుష్యంత్‌ని ప్రియాసేథ్ దారుణంగా చంపేసింది. ఈ కేసులో ప్రియాసేథ్ నేరాన్ని అంగీకరించింది. దుష్యంత్ శర్మ కేసులో జైపూర్ కోర్టు ముగ్గురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2018లో ప్రారంభమైన ఈ సంబంధం చివరకు హత్యతో ముగిసింది. అప్పటికే వివాహం చేసుకున్న దుష్యంత్ ఢిల్లీకి చెందిన ధనవంతుడైన వ్యాపారవేత్తగా వివాన్ కోహ్లీ అనే నకిలీ పేరుతో పరిచయమ్యాడు. డబ్బున్న వాడు కావడంతో అతన్ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేయాలని ప్రియాసేథ్, దుష్యంత్‌ని ట్రాప్ చేసింది. దీనికి ప్రియా సేథ్‌కి మరో ఇద్దరు దీక్షంత్ కమ్రా, లక్ష్య వాలియా సహాయం చేశారు.
Read Also: Balakrishna: బాలకృష్ణపై విచిత్ర లైంగిక వేధింపుల ఆరోపణలు.. అందుకే చేశారట!
అయితే, కిడ్నాప్ చేసిన తర్వాత బెదిరింపు కాల్ చేసిన తర్వాత తెలిసింది, అసలు దుష్యంత్ ఢిల్లీ వ్యాపారవేత్త కాదని, కిడ్నాప్ చేసిన వారు దుష్యంత్ కుటుంబం నుంచి రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. దుష్యంత్‌ని చాలాసార్లు పొడిచి, దిండుతో అదిమి చంపేశారు. హత్య వివరాలను దుష్యంత్ పంచుకున్నారు. ‘‘ నా కొడుకు ఫోన్ నుంచి కాల్ వచ్చింది.. నాన్న నన్ను చంపేస్తారు, దయచేసి రూ. 10 ఇచ్చి నన్ను రక్షించండి’’ అని దుష్యంత్ తండ్రి రామేశ్వర్ ప్రసాద్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదని సాయంత్రం 4 గంటల వరకు రూ. 3 లక్షలు ఇస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఆ డబ్బు నుంచి రూ. 20,000 విత్ డ్రా చేసేందుకు నేరస్తులు దుష్యంత్ డెబిట్ కార్డును ఉపయోగించారు. అయితే తమ నేరం బయటకు వస్తుందని ముగ్గురు నిందితులు దుష్యంత్‌ని చంపేశారు. 2018లో జైపూర్ గ్రామంలో ఓ సూట్ కేసులో దుష్యంత్ డెడ్ బాడీ లభించింది.
ఈ కేసులో ప్రియాసేథ్ నేరాన్ని అంగీకరించింది. ‘‘ అతను నాకు అసలు పేరు చెప్పలేదు. అతను చాలా ధనవంతుడిని అని చెప్పాడు. నేను అప్పటికే దీక్షాత్‌తో లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నాను, అతనికి రూ.21 లక్షల అప్పు ఉంది. ఈ డబ్బును పొందాలనే దుష్యంత్‌ని కిడ్నాప్ చేశామని’’ నేరస్తురాలు ప్రియా చెప్పింది. అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత ఎందుకు చంపారని ప్రశ్నిస్తే.. డబ్బులు రాకముందే దుష్యంత్ ని చంపేసినట్లు వెల్లడించింది.