Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లోని ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థినులు తలపెట్టిన ఫ్యాషన్ షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోపై జమియత్-ఏ-ఉలేమా అనే ముస్లిం సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దీనిపై బీజేపీ స్పందించింది. ముస్లిం సంస్థ తీరును తప్పుపట్టింది.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.
Supreme Court: పాకిస్తాన్‌కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్‌ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిష
North Korea: ఉత్తర కొరియా తొలిసారిగా తన సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా అభ్యంతరాలను పెడచెవిన పెట్టి, కిమ్ జోంగ్ ఉన్ శాటిలైట్ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా నిర్వహించ స్పై శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది.
Uttarakhand Tunnel Operation: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నారు. కొన్ని మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నారని రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. 17 రోజులుగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల బంధువులు వారి బట్టలు, బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్‌ని చంపినట్లు వెలుగులోకి వచ్చింది.
Tiger Reserve: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్, నార్సింగ్ పూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం, దామోహ్ జిల్లాలోని రాణి దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాన్ని విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. 12 తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకుల గుంపు దాడి చేసింది, అంతటితో ఆగకుండా అతనిపై మూత్రవిసర్జన చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. డార్క్ గ్రే కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి బాధిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్ర విసర్జన చేయడం వీడియోలో కనిపిస్తోంది. మరో ఇద్దరు ఈ ఉదంతాన్ని వీడియో తీశారు. దాడి ఆపాలని విద్యార్థి ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. విద్యార్థి తలపై,…
NIA: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా జాతీయ దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజున ఎన్ఐఏ బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ నిర్వహిస్తున్న టెర్రర్ మాడ్యుల్ కేసులో ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్, గుజరాత్ లోని గిర్ సోమనాథ్, ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్, కేరళలోని కోజికోడ్‌లో ఎన్ఐఏ దాడులు చేసింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న గజ్వా-ఏ-హింద్ టెర్రర్ మాడ్యుల్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా…
Spying: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు టెర్రర్ ఫైనాన్సింగ్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమృత్ గిల్ అలియాస్ అమృత్ పాల్ (25), ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న రియాజుద్దీన్ (36)లను ATS అరెస్టు చేసింది.