Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో సిస్టమ్ ఉంది.
ప్రస్తుతం టెస్లాకు అమెరికా బయట జర్మనీ, చైనాలో మాత్రమే ప్లాంట్స్ ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో టెస్లా ఓ కండిషన్ పెట్టినట్లు వినికిడి. వచ్చే రెండేళ్లలో దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం రాయితీ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ అంగీకరిస్తే, ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా లాంచ్‌ని ప్రారంభించేందుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్ సందర్శించే అవకాశం ఉంది.
గతేడాది భారతదేశంలో 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది లక్ష దాటే అవకాశం ఉంది. 140 కోట్ల మంది ఉన్న అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌ని సద్వినియోగం చేసుకోవాలని టెస్లా ఉంది. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటంపై టెస్లా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
టెస్లా 12,000 వాహనాలకు రాయితీ టారిఫ్ ప్రకటిస్తే 500 మిలియన్ల పెట్టుబడి, 30,000 వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే 2 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2023లో అంచనా వేస్తున్న ఒక లక్ష వాహనాల్లో 10 శాతం అంటే 10,000 వాహనాలకు సుంకాలను తగ్గించాలని భారత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..