Earthquake: ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షినంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.
Denmark: యూరోపియన్ దేశాల్లో ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని అగౌరపరచడం, దైవదూషణ చేయడంపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన అక్కడి దేశాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. ఇదిలా ఉంటే డెన్మార్క్ దేశం కీలక బిల్లును అక్కడి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడాన్ని చట్టవిరుద్ధంగా చెబుతూ, గురువారం బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Russia: ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల తేదీని రష్యా చట్టసభ సభ్యులు నిర్ణయించారు. వచ్చే ఏడాడి (మార్చి 17, 2024)న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.
Pinarayi Vijayan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా వివాదం ముదురుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ టార్గెట్‌గా సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ‘‘సంఘ్ పరివార్ ప్రతినిధి’’ అంటూ అభివర్ణించారు. యూనివర్సిటీ సెనెట్‌కి నామినీలను ఎన్నుకునే విషయంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కేరళ విశ్వవిద్యాలయ సిఫారసులను తిరస్కరించిన తర్వాత విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికన్ పౌరుడైన పన్నూని హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, అతనికి ఓ భారత ప్రభుత్వ ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయని అమెరికా న్యాయశాఖ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. అయితే అమెరికన్ పౌరుడిని, అమెరికన్ గడ్డపై హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సంఘటను భారత్…
Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Painkiller Meftal: రుతుక్రమంలో వచ్చే పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులకు సాధారణంగా వినియోగించే పెయిన్ కిల్లర్ మెఫ్టాల్పై కీలక ఆదేశాలు జారీ చేసింది. మెఫ్టాల్ వల్ల వచ్చే ప్రతికూల చర్యలను పర్యవేక్షించాలని డాక్టర్లకు, రోగులకు సలహా ఇస్తూ ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్(ఐపీసీ) డ్రగ్ సేఫ్టీ హెచ్చరికలను జారీ చేసింది. మెఫెనామిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, డిస్మెనోరియా, తేలికపాటి నుండి మితమైన నొప్పి, మంట, జ్వరం, దంత నొప్పికి చికిత్సలో వినియోగిస్తున్నారు.
India: పాకిస్తాన్లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని, క్యాఫ్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. మెజారిటీ సభ్యులు ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు రాబోతున్నట్లు సమాచారం. ఈ నివేదికపై డివిజన్ ఓట్లు అడగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఈ నివేదిక పార్లమెంట్ ముందుకు వస్తున్న క్రమంలో తన సభ్యులంతా…