Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు.
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది.
Article 370: జమ్మూకాశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికరణ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ అంశాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అక్రమం అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. సోవియట్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన స్టాలిన్ రికార్డును కూడా పుతిన్ బద్ధలు కొట్టారు. తాజాగా అక్కడి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సమావేశమైంది.
MRI Machine: అమెరికాలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. జూన్ నెలలో ఒక మహిళ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజినింగ్) మెషీన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్లింది. ఈ పరిణామం ఆమె ప్రాణాలను మీదికి తెచ్చింది. లోడ్ చేయబడిన తుపాకీ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయమైంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం..57 ఏళ్ల మహిళ ఈ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది.
Misfire: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహిళ అనూహ్యంగా మరణించింది. అదే సమయంలో ఓ అధికారి చేతుల్లో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ మహిళకు తాకడంతో అక్కడే నేలపై పడిపోయింది యూపీలోని అలీఘర్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇష్రత్ అనే మహిళను ఆస్పత్రికి తరలించారు, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడైన పోలీస్ పరారీలో…
Car prices hike: కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి కార్ మేకర్స్ వచ్చే నెల నుంచి…
Kerala Doctor Suicide: కేరళలో ఓ యువ వైద్యురాలి మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 22 ఏళ్ల షహానా వరకట్న వివాదంతో ఆత్మహత్యకు పాల్పడింది. షహనా బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ ఇఏ రువైస్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు భారీగా కట్నాన్ని డిమాండ్ చేశారు. ఏకంగా బీఎండబ్ల్యూ కారు, 150 తులాల బంగారం, 15 ఎకరాల భూమిని డిమాండ్ చేశాడు. రువైస్ వరకట్న దాహాన్ని తీర్చలేకపోవడంతో, షహానాతో వివాహం ఆగిపోయింది.
Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. అయితే ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.