Denmark: యూరోపియన్ దేశాల్లో ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని అగౌరపరచడం, దైవదూషణ చేయడంపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన అక్కడి దేశాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. ఇదిలా ఉంటే డెన్మార్క్ దేశం కీలక బిల్లును అక్కడి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడాన్ని చట్టవిరుద్ధంగా చెబుతూ, గురువారం బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Read Also: Praja Bhavan: తొలగిపోయిన ప్రజాభవన్ కంచె.. చూసేందుకు ఎగబడ్డ జనాలు
డెన్మార్క్, స్వీడన్ దేశాల్లో ఈ ఏడాది ప్రజా నిరసనలు వెల్లువెత్తాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండే ప్రజలు ఖురాన్ కాపీలను తగలబెట్టారు. ఈ పరిణామాలు ముస్లిం సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. నార్డిక్ దేశాలలో ఇలా ఖురాన్ ప్రతులను తగలబెట్టే విధానాల నిషేధించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా దేశాల్లోని ప్రజలు మాత్రం ఇలా మతాన్ని విమర్శించడంపై పరిమితులు విధించడం, ఉదారవాద స్వేచ్ఛను దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. డెన్మార్క్‌లోని సెంట్రిస్ట్ సంకీర్ణ ప్రభుత్వం కొత్త నిబంధనలు స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర్యంపై స్వల్ప ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతోంది.. ఇతర మార్గాల్లో మతాన్ని విమర్శించడం చట్టబద్ధంగా ఉంటుందని చెబుతోంది.