Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
IT Raids: ఒడిశాలోని మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒడిశా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడ్డాయి. బుధవారం మద్యం పరిశ్రమలో పన్నుల ఎగవేతపై ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేయడం ప్రారంభించారు. గురువారం కూడా ఈ కేసులో అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ ఒడిశాలోని ప్రముఖ మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన బల్డియో సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రైడ్స్ నిర్వహించారు.
Tejas Jet: ఇండియాలో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాలకు భారీగా క్రేజ్ ఏర్పంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తు్న్నాయి. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలోనే తయారవుతోంది. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL) ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది.
Kerala doctor Suicide: వరకట్న వివాదం ఓ మహిళా వైద్యురాలి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. షహానా అనే యువతి తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిగా ఉంది. వరకట్నం ఇవ్వలేదని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అద్దె అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. యువతి కుటుంబం వరకట్నం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని, ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపించారు.
Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది.
China: ప్రపంచంలో మొట్టమొదటిసారి చైనా నెక్ట్స్ జనరేషన్ గ్యాస్డ్-కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్లు చైనా స్టేట్ మీడియా బుధవారం వెల్లడించింది. తూర్పు షాన్డాంగ్ ప్రావిన్సులోని షిడావో బే ప్లాంట్‌లో ఈ ఫోర్త్ జనరేషన్ రియాక్టర్ని ప్రారంభించారు.
ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ గురించి శర్మిష్ట ముఖర్జీ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీకి, మోడీకి ఉన్న సంబంధాల గురించి వెల్లడించారు. ప్రధాని మోడీతో, ప్రణబ్ ముఖర్జీకి విచిత్రమై సంబంధం ఉందని, మోడీ ఎప్పుడూ ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నిజాయితీతో నమస్కరించేవారని చెప్పారు.
The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది.
Italy: చైనా తన వ్యాపార విస్తరణ, తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) ప్రాజెక్టును మొదలుపెట్టింది. అయితే కోవిడ్ పరిణామాలు, చైనాపై అపనమ్మకం, ఈ ప్రాజెక్టుపై భాగస్వామ్య దేశాల అనుమానాలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి కీలక దేశం ఇటలీ వైదొలుగుతున్నట్లు అధికారికంగా చైనాకు తెలియజేసింది. ప్రతిష్టాత్మక చైనా ప్రాజెక్టుపై సందేహాలకు నేటితో తెరపడింది.