BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
Amit Shah: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.
Rahul Gandhi: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో పుస్తకం రాశారు. త్వరలో ఈ బుక్ రిలీజ్ కాబోతోంది. బతికున్న రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్న, ఆయన చెప్పిన విషయాలపై, రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో నెహ్రూ-గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీకి ఉన్న వ్యక్తిగత ఆరాధన
CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అవినీతి మరక లేకుండా గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే ఎంతటి సీఎం అయిన చాలా హుందాగా, క్షమశిక్షణగా ఉండటం శివరాజ్ సింగ్ నైజం. ఓడిపోయినా, గెలిచినా కూడా తాను ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను మాత్రమే అని చెబుతుంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, బీజేపీ ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని అఖండమైన మెజారిటీతో విజయం అందించారు.
PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు.
Floods: మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై మొత్తం నదిలా మారిపోయింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుఫానులు వస్తున్నాయంటే చాలు చెన్నై వణికిపోతోంది. డిసెంబర్ 4, 2023 నాటికి 48 గంటల్లోనే 40 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాత నమోదు కావడం నగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా పలు తుఫాన్ల సమయంలో చెన్నై ఇలాగే వరద గుప్పిట చిక్కుకుంది.
Amit Shah: లోక్‌సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్ల్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని మరోసారి నిందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు మాజీ ప్రధాని బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని లేకపోతే అది భారతదేశంలో భూభాగం ఉండేదని ఆయన చెప్పారు.
Mass Killing: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్‌బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
Chhattisgarh: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ తెలంగాణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 54 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ అధికారం కోల్పోయి 35 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
Anurag Thakur: బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ గెలుపును ఉద్దేశిస్తూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణ భారత దేశంలో గెలవదని డీఎంకే పార్టీ ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.