France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు.
Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్‌కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్,
Seema Haider: భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి పరీక్షలో ప్రశ్న అడగడం, దీనికి ఓ విద్యార్థి రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా ఇంటర్నెట్‌ని ఆకట్టుకుంటుంది ఈ సమాధానం. విషయానికి వస్తే.. పరీక్షలో ‘‘ భారత్- పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై, లంబే […]
BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.
బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.
Dunki: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ నటించిన ‘డంకీ’ మూవీకి అరుదైన గౌరవం లభించింది. తాజాగా విడుదలై ఈ సినిమా నార్త్ ఇండియాతో పాటు, ఓవర్సీస్లో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.
Xi Jinping: చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ అధినేత షి జిన్‌పింగ్, పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తిగత చిత్తశుద్ధిని కాపాడుకోవాలని, బంధువులను అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సిపిసి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) సెంట్రల్ కమిటీ యొక్క పొలిటికల్ బ్యూరో సభ్యులు మార్క్సిస్ట్ మేధావుల ప్రమాణాలను పాటించాలని, మొత్తం పార్టీ వ్యక్తిగత సమగ్రతకు, క్షమశిక్షణకు ఉదాహరణగా నిలుస్తారని అన్నారు. డిసెంబర్ 22న కీలక పార్టీ సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ ఇది మా ఉజ్జయిని సమయం, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కానీ పారిస్ సమయాన్ని నిర్ణయించడం ప్రారంభించింది. గ్రీన్‌విచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా భావించి బ్రిటిషర్లు దీనిని స్వీకరించారు’’ అని ఆయన గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
WFI Row: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయంపై ఏస్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కెరీర్‌కి గుడ్ బై చెప్పింది. రెజ్లర్లు బజరంగ్ పునియా, విజేందర్ సింగ్ వంటి వారు తమ పద్మ శ్రీ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.