Drone Attack: రెడ్ సీలో ఇండియా ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. రెండు రోజుల్లో రెండో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్‌కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత యూఎస్ నౌకకు ఎంవీ సాయిబాబ నుంచి డిస్ట్రెస్ కాల్ వెళ్లినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది.
ఎర్ర సముద్రంలో భారత్ వస్తున్న నౌకతో పాటు మరో నౌక తాము దాడికి గురవుతున్నట్లు యూఎస్ నౌకదళ షిప్‌కి సమాచారం అందించాయి. భారత్ వస్తున్న నౌకతో పాటు ఎంవీ బ్లామనెన్ అనే నార్వే జెండా కలిగిన కెమికల్ ట్యాంకర్ నౌకపై కూడా హౌతీ డ్రోన్ దాడి జరిపింది. అయితే ఈ దాడి మిస్ అయినట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
Read Also: CM Revanth Reddy: ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే అధికారులు జోడెద్దుల్లా పని చేయాలి
అంతకుముందు రోజు ఇండియా వైపు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్ దీనిపై దాడి చేసిందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. దాదాపు 20 మంది భారతీయ సిబ్బందితో కూడిన MV కెమ్ ప్లూటో, ముడి చమురుతో ఇండియాకు వస్తున్న క్రమంలో గుజరాత్ లోని వెరావల్‌కి నైరుతి దిశలో 200 నాటికన్ మైళ్ల దూరంలో దాడికి గురైంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యలో యెమెన్ లోని హౌతీ తిరుగుబాటు దాడులు రెడ్ సీ నుంచి వచ్చి వెళ్లే ట్యాంకర్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న, ఇజ్రాయిల్ కి చెందిన నౌకలపై దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!