Congress: వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలకు ఇంఛార్జులను కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ ఇంఛార్జ్‌గా ఉన్న ప్రియాంకాగాంధీన వాద్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో యూపీ ఇంఛార్జ్‌గా అవినాష్ పాండేని నియమించింది.
Read ALSO: Coronavirus: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 12 పాజిటివ్ కేసులు
సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌కు గుజరాత్ ఇన్‌ఛార్జ్‌గా, రణదీప్ సింగ్ సూర్జేవాలాను కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. జైరాం రమేష్‌ను కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు, కెసి వేణుగోపాల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా జనరల్ సెక్రటరీగా కొనసాగుతారు. ఏఐసీసీ కోశాధికారిగా సీనియర్ నేత అజయ్ మాకెన్ కొనసాగనున్నారు.
12 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు 11 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జులను కూడా నియమించింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యతలను జీఎస్ మీర్‌కు అప్పగించారు. తెలంగాణ, లక్షద్వీప్, కేరళ ఇంఛార్జుగా దీపాదాస్ మున్షీకి నియమించారు. రమేష్ చెన్నితాలని మహారాష్ట్ర బాధ్యుడిగా నియమించారు.
Congress leader Priyanka Gandhi Vadra has been relieved from the post of AICC in-charge of UP Congress. Sachin Pilot appointed as in-charge of Chhattisgarh Congress. Ramesh Chennithala appointed as AICC in-charge of Maharashtra. pic.twitter.com/rbmHumcBEa
— ANI (@ANI) December 23, 2023