Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలు, వైరల్ వీడియోలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పిల్లాడి వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లాడు చెప్పినట్లు చేస్తే తన కంపెనీ దివాళా తీస్తుందని’’ ఫన్నీగా ట్వీట్ చేశారు.
Ajit Pawar: ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయం లేదని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం అన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై, ప్రతిపక్షాలు ప్రధాని మోడీని సవాల్ చేయాలనుకుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో జరిగింది. అవమానం భరించలేక బాలిక ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దామోహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మైనర్ బాలిక తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు.
Chennai: తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది.
Covid-19 cases: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కేసులం సంఖ్య పెరుగుతోంది. దీనికి కొత్త వేరియంట్ JN.1 కూడా కారణమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. .
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్‌పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్‌ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్‌లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది.
Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ఆయన స్మారక చిహ్నం ‘ సదైవ్ అటల్’ వద్దకు చేరుకున్న బీజేపీ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు నివాళులు అర్పించారు.
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్‌వే విజువల్ రేంజ్(ఆర్వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.