Covid-19 cases: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కేసులం సంఖ్య పెరుగుతోంది. దీనికి కొత్త వేరియంట్ JN.1 కూడా కారణమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరొక టెర్రరిస్ట్ ఖతం.. ఈ సారి మాత్రం చంపే స్టైల్ మారింది..
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 4054 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఒక్క కేరళలోనే 128 యాక్టీవ్ కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,128కి పెరిగింది. కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్ లో 11, తమిళనాడులో 9, తెలంగాణలో 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మరణాల సంఖ్య 5,33,334కి చేరుకుంది. తాజా ఇన్‌ఫెక్షన్‌లతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,09,248)కి చేరుకుంది.
దేశంలో గత 24 గంటల్లో 315 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.