Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో జరిగింది. అవమానం భరించలేక బాలిక ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దామోహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మైనర్ బాలిక తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ లో మోస్ట్ పాపులర్ కార్లు..ఎక్కువగా కొనేవి ఏంటో తెలుసా ?
అయితే, ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన అనంతరం బాలిక ఇంట్లో ఉంచిన పురుగుల మందు తాగింది. బాలిక పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బాలికను దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ మొదలుపెట్టారు. వైద్యపరీక్షల్లో మైనర్‌పై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది.