Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్‌లో “నో క్రిస్‌మస్”.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్‌లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది.
ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్‌లో క్రిస్మస్ వేడుకలను ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావితం చేసింది. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ఈ పట్టణం నిర్జనంగా మారిపోయింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంకి దక్షిణంగా ఉన్న బెత్లెహమ్‌లోనే క్రీస్తు పుట్టినట్లు అంతా భావిస్తారు. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి కారణంగా, ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. దీంతో గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది అక్కడి క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. ప్రజలు ఎవరూ రావడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. తమ జీవితంలో ఇప్పటి వరకు ఇంత చెత్త క్రిస్మస్ పండగను ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
Read Also: Indonesia : ఇండోనేషియాలోని నికెల్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి.. డజన్లమందికి గాయాలు
జెరూసలెంకి దక్షిణంగా ఉన్న బెత్లహమ్‌లోని జీసస్ జన్మించిన ప్రదేశంగా భావించే చర్చ్ ఆఫ్ ది నేటివిటీని చూడటానికి ప్రపంచంలో నలుమూలల నుంచి క్రైస్తవులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అయితే అక్టోబర్ 7కి ముందు అక్కడి హోటళ్లు, వ్యాపారాలు రద్దీగా ఉంటేవి, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, వచ్చే ఏడాదితో సహా బుకింగ్స్ అన్ని రద్దు చేసుకున్నారు. ఇజ్రాయిల్ పొరగున ఉన్న పాలస్తీనాకి సంబంధించిన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఈ భూభాగంలో యూదుల నివాసాలు పెరిగాయి.
గత అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు, ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాతో పాటు వెస్ట్ బ్యాంకుపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!