Heart Attack: ఇటీవల కాలంలో చిన్న పిల్లాడి నుంచి యువకుల వరకు పలువురు అకస్మాత్తు గుండెపోటుల వల్ల మరణిస్తున్నారు. 30 ఏళ్లకు దిగువన ఉండే యువకులు కూడా ఇలా ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించాడు. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో 22 ఏళ్ల ఇందల్ సింగ్ జాదవ్ బంజారా గుండెపోటుకు గురై మరణించాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ విమానంలో లూజ్ బోల్ట్ హెచ్చరికలతో భద్రతా తనిఖీలు నిర్వహించాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) భావిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో రడ్డర్ కంట్రోల్ లింకేజ్ మెకానిజంలో నట్ లేకుండా బోల్ట్ ఉండటాన్ని గమనించారు. దీని తర్వాత రడ్డర్ నియంత్రణ వ్యవస్థను నిశితంగా పర్యవేక్షించనున్నారు.
TikTok: పాకిస్తాన్ దేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్ టిక్‌టాక్ వివాదాస్పదమవుతోంది. అక్కడి యువత టిక్‌టాక్ బారిన పడుతోంది. ఇదిలా ఉంటే అక్కడి మతపెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇస్లాంకు విరుద్ధమని ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ వివాదం ఇద్దరు అక్కాచెల్లిళ్ల మధ్య గొడవకు కారణమైంది. 14 ఏళ్ల బాలిక, మరో సోదరిని కాల్చి చంపింది. ఈ వివాదం పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీత్-ఎ-హురియత్(TeH)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)ని 'చట్టవిరుద్ధమైన సంఘం'గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు, మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు.
Rave Party: న్యూ ఇయర్‌కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో యువత కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాలని ప్లాన్స్ చేసుకుంది. అయితే కొందరు మాత్రం డ్రగ్స్, రేవ్ పార్టీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర థానే నగరంలో రేవ్ పార్టీపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో ఏకంగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Indian Navy: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో రెడ్ సీ, అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్గాల నుంచి ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నాయి. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌కి చెందిన పలు నౌకలపై కూడా డ్రోన్ దాడులు జరిగియా. ఈ నేపథ్యంలో ప్రాంతాల గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడుల్ని అడ్డుకునేందుకు ఇండియన్ నేవీ సిద్ధమైంది.
Toilet remark row: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీతో సహా బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసింది. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు పనిచేయకపోతే మీ పనులు నడవవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జైన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం నియంతృత్వం ముందు ఉందని అన్నారు. భారతదేశ స్వేచ్ఛను రక్షించే సమయం ఆసన్నమైందని అన్నారు. తూర్పు ముంబైలోని కుర్లాలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి ఈ తరహా ప్రతిస్పందన వచ్చింది.
Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయని…