Ajit Pawar: ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయం లేదని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం అన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై, ప్రతిపక్షాలు ప్రధాని మోడీని సవాల్ చేయాలనుకుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
Read Also: KA Paul: పవన్‌కు ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు’ పరిస్థితి..!
ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్నామ్నాయం లేదని, ఇలాంటి నిర్ణయం ఒకటి రెండు అంశాల ఆధారంగా కాకుండా.. వివిధ అంశాల అధారంగా తీసుకోబడిందని అజిత్ పవార్ అన్నారు. దేశ ప్రయోజనాలను ఎవరు రక్షిస్తారు, దేశం ఎవరి చేతిలో సురక్షితంగా, పటిష్టంగా ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఎవరు పెంచుతారనే పలు అంశాలు చాలా ముఖ్యమైనవని అజిత్ పవార్ అన్నారు.
ఈ ఏడాది మహారాష్ట్ర ఎన్సీపీలో చీలిక వచ్చింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ ఎన్డీయే కూటమిలో చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన(ఏక్నాథ్ షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు శరద్ పవార్ ఇండియా కూటమితో ఉన్నారు. అజిత్ పవార్ మహాప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవిని పొందగా.. మరో 8 మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.