TikTok: పాకిస్తాన్‌లో టిక్ టాక్ వివాదం.. సోదరిని కాల్చి చంపిన 14 ఏళ్ల బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TikTok: పాకిస్తాన్ దేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్ టిక్‌టాక్ వివాదాస్పదమవుతోంది. అక్కడి యువత టిక్‌టాక్ బారిన పడుతోంది. ఇదిలా ఉంటే అక్కడి మతపెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇస్లాంకు విరుద్ధమని ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ వివాదం ఇద్దరు అక్కాచెల్లిళ్ల మధ్య గొడవకు కారణమైంది. 14 ఏళ్ల బాలిక, మరో సోదరిని కాల్చి చంపింది. ఈ వివాదం పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. టిక్ టాక్ లో వీడియో చిత్రీకరించడం ఇద్దరు సోదరీమణలు సభా అఫ్జల్, మరియా అఫ్జల్ మధ్య వివాదానికి కారణమైంది. గొడవ తర్వాత 14 ఏళ్ల సబా అఫ్జల్ తన సోదరిని కాల్చిచంపింది. ఆమె సోదరుడు సద్దర్ పోలీస్ స్టేషన్ లో సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది.
Read Also: Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీక్-ఎ-హురియత్’పై కేంద్రం ఉక్కుపాదం..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అంతకుముందు.. ఇలాగే పాకిస్తాన్‌లో టిక్ టాక్ మూలంగా పలు మరణాలు సంభవించాయి. డిసెంబర్ నెలలో షేఖ్ పురా జిల్లాలో టిక్ టాక్ వీడియో చేస్తుండగా, ముగ్గురు యువకులను కార్ ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. డిసెంబర్ 24న సింధ్ ప్రావిన్స్ రాజధాని కారాచీలోని ప్రముఖ మత పాఠశాల జామియా బినోరియా టౌన్, టిక్ టాక్‌ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది. మహిళలు అశ్లీలంగా డాన్స్ చేయడాన్ని ఓ కారణంగా ఫత్వా పేర్కొంది. అంతకుముందు 2021లో పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ జూలై నుండి నవంబర్ వరకు వీడియో షేరింగ్ యాప్‌పై ఐదు నెలల నిషేధాన్ని విధించింది. ప్లాట్‌ఫారమ్‌లో అసభ్యకరమైన లేదా అనైతిక కంటెంట్‌ను నియంత్రించడానికి చర్యలు పెంచుతామని TikTok హామీ ఇచ్చిన తర్వాత నిషేధం ఎత్తివేసింది.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!