Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్‌పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి ఈ తరహా ప్రతిస్పందన వచ్చింది.
అమెరికా వాదనల్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని, విలువలేనివిగా ప్రకటిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనాని అన్నారు. ఇటువంటి వాదనలతో గాజాలో నియోనిస్టు పాలన(ఇజ్రాయిల్) నేరాలను అమెరికన్ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఇరాన్ చెప్పింది.
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
Read Also: Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్‌కి మద్దతుగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. అయితే ఈ హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని దేశాల నౌకా సంస్థలు రెడ్ సీ, సూయజ్ కెనాల్ ద్వారా రాకపోకలను రద్దు చేసుకుంటున్నాయి. యూరప్ నుంచి ఆసియాకు వెళ్లేందుకు ఆఫ్రికా ఖండాన్ని చుట్టివస్తున్నాయి.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాను టార్గెట్ చేసి టార్గెట్ చేస్తోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ పూర్తిగా నేలమట్టం అయ్యేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని జెంజమన్ నెతన్యాహూ చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!