Covid variant JN.1: దేశంలో 63 కొత్త వేరియంట్ కేసులు.. టాప్‌లో గోవా, తెలంగాణలో కూడా నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఆదివారం రోజు దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉంటే.. సోమవారం 4054కి యాక్టీవ్ కేస్ లోడ్ పెరిగింది.
Read Also: 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం ఉంది: దామోదర రాజనర్సింహ
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
తాజాగా దేశంలో విస్తరిస్తున్న JN.1 వేరియంట్ ఓమిక్రాన్ వేరియంట్‌కి వారసుడిగా చెబుతున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవని, చాలా సందర్భాల్లో రోగులు ఇంటి వద్దే సాధారణ లక్షణాల నుంచి కోలుకుంటుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 4054 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఒక్క కేరళలోనే 128 యాక్టీవ్ కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్ లో 11, తమిళనాడులో 9, తెలంగాణలో 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మరణాల సంఖ్య 5,33,334కి చేరుకుంది. తాజా ఇన్‌ఫెక్షన్‌లతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,09,248)కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 315 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?