Toilet remark row: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీతో సహా బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసింది. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు పనిచేయకపోతే మీ పనులు నడవవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Holiday: జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఇదిలా ఉంటే డీఎంకేపై సర్వత్రా విమర్శలు రావడంతో, బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణాది వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన పాత వీడియోను డీఎంకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దక్షిణ భారతీయులు ‘‘నల్లగా’’ ఉంటారని ఆయన చెప్పడం వీడియోలో చూడవచ్చు. ‘‘ మేము జాత్యహంకారంతో ఉంటే దక్షిణాది ఎందుకు తమతో ఉంటుంది..తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా వారితో ఎందుకు జీవిస్తాము..? మా చుట్టూ ఉన్న ప్రజలు నలుపు రంగులో ఉన్నారు’’ అని రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ అన్నారు. డీఎంకే ఐటీ సెల్ ఈ వీడియోను షేర్ చేసింది. 2017లో ఆల్ జజీరా టీవీలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ కామెంట్స్ జాతీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ తరువాత తన వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పారు.
Tarun Vijay, a BJP MP, has called South Indians "black." Isn't this racism? pic.twitter.com/rF9oTs6aWH
— இசை (@isai_) December 25, 2023