Indian Navy: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో రెడ్ సీ, అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్గాల నుంచి ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నాయి. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌కి చెందిన పలు నౌకలపై కూడా డ్రోన్ దాడులు జరిగియా. ఈ నేపథ్యంలో ప్రాంతాల గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడుల్ని అడ్డుకునేందుకు ఇండియన్ నేవీ సిద్ధమైంది.
Read Also: Harish Rao: పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే.. ఆరు గ్యారెంటీ ల పరిస్థితి ఏంటి ?.. హరీష్ రావ్ ప్రశ్న..
భారతతీరానికి దాదాపుగా 700 నాటికల్ మైళ్ల దూరంలో ఎంవీ రుయెన్‌పై, 220 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న ఎంవీ కెమ్ ఫ్లూటోపై ఇటీవల భారత ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) జలాల్లో డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ నేవీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు చేపట్టడానికి, దాడులను అడ్డుకునేందుకు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్‌లను మోహరించారు. సముద్ర తీరంపై గస్తీ విమానాలతో పాటు రిమోట్‌గా పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (RPAS) ద్వారా వైమానిక నిఘా ద్వారా భారత కోస్ట్ గార్డు ఇండియన్ నేవీతో సమన్వయం చేసుకోనుంది. అరేబియా సముద్ర ప్రాంతంతో భద్రతను పెంచడంతో పాటు అనుమానాస్పద కార్యక్రమాలను పరిశీలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు నేవీ అధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న ప్రతీ వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేందుకు హమాస్‌కి మద్దతుగా హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. అయితే వీరికి ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లు అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి.