Rave Party: న్యూ ఇయర్‌కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో యువత కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాలని ప్లాన్స్ చేసుకుంది. అయితే కొందరు మాత్రం డ్రగ్స్, రేవ్ పార్టీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర థానే నగరంలో రేవ్ పార్టీపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో ఏకంగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Read Also: Indian Navy: ఇండియన్ నేవీ వచ్చేస్తోంది..దమ్ముంటే దాడులు చేయండి..
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు ఈ దాడులు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిలో రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. థానే పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అర్ధరాత్రి ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది, తెల్లవారుజామున 2 గంటలకు దాడులు ప్రారంభమయ్యాయి. థానేలోని వడవలి క్రీక్ సమీపంలోనే మారుమూల ప్రాంతంలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఎల్‌ఎస్‌డీ, చరస్, ఎక్స్‌టసీ పిల్స్, గంజాయితో సహా చట్టవిరుద్ధ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని, డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా.? అని పరీక్షించేందుకు వైద్య పరీక్షలకు పంపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాది మంది యువకులకు రేవ్ పార్టీ కోసం ఆహ్వానం పంపినట్లు తెలిసింది.