Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మంగళవారం ఆరోపించింది. ఈ అరెస్టును హిందువులపై వేటగా అభివర్ణించింది.
JN.1 Cases: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసుల్లో పెరుగుదల కూడా కలవరపరుస్తోంది. ఇన్సాకాగ్(INSACOG) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 263 JN.1 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కేరళలోనే నమోదయ్యాయి.
ICU Admit: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)రోగిని చేర్చుకోవడంపై కొత్తగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రోగి కండీషన్ విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్స అందిస్తుంటారు. ఇలా ఐసీయూలో చేరికపై 24 మంది నిపుణులు చర్చించి కొత్తమార్గదర్శకాలను జారీ చేశారు. ఈ కొత్త మార్గదర్శకాల్లో రోగి బంధువుల ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తనను వేధించినట్లు చిన్మయి ఆరోపించింది. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.
Tokyo-Haneda airport: జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తర్వాత 400 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు.
Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒంటరిగా ఆడవాళ్లు కనబడితే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో 26 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పాటు మరో కీలక నిందితుడు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Hit-And-Run Law: కేంద్రం తీసుకువచ్చిన కొత్త హిట్-అండ్-రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు. త్వరలో అమలు చేయబోతున్న క్రిమినల్ కోడ్‌కి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునివ్వడంతో ఇది మిగతా వాహనదారుల్లో భయాలను పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇలాగే నిరసనలు కొనసాగితే నిత్యావసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
NIA: విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరిని ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు, డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు. వీటిపై స్పష్టమైన సమాచారం అందించే వ్యక్తులకు రూ.1 లక్ష నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు రివార్డులు ఇవ్వనున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాదులు, ఆయుధాలు, నిషేధిత పదార్థాల రవాణా చేయడానికి దేశవ్యతిరేక శక్తులు ఉపయోగించే సరిహద్దుల్లోని సొరంగాల జాడ చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.