Tata Punch.ev: టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్‌గా టాటా ఉంది. ఇప్పటికే టాటా నుంచి టియాగో, టిగోర్, నెక్సాన్ ఈవీలు రాగా.. ఇప్పుడు టాటా పంచ్ ఈవీని తీసుకువస్తోంది. ఈ కార్‌పై జనాల్లో చాలా ఆసక్తి ఉంది. పంచ్ ఈవీ పూర్తిగా ఈవీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది టాటా. జనవరి 17న Tata Punch.ev లాంచ్ కాబోతోంది.
పంచ్. ఈవీ టాటా కొత్త అధునాతన EV ఆర్కిటెక్చర్ acti.ev (అధునాతన కనెక్ట్ చేయబడిన టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్)పై బిల్ట్ అయింది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ఈ నెల ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. రూ.21,000 టోకెన్ మొత్తానికి బుక్ చేసుకోవచ్చు.
Read Also: Maruti Suzuki: షాక్ ఇచ్చిన మారుతి సుజుకీ.. అన్ని కార్ మోడళ్ల ధర పెంపు..
టాటా పంచ్.ev సరికొత్త ఫీచర్లలో రాబోతోంది. ఫుల్లీ టెక్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. LED DRLలతో కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. LED టెయిల్‌ల్యాంప్‌లు మరియు 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. హర్మాన్ నుంచి 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, Arcade.ev యాప్ సూట్, 360-డిగ్రీ కెమెరా సరౌండ్ వ్యూ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్తగా వస్తున్న పంచ్.ఈవీ రెండు డ్రైవింగ్ రేంజ్‌లను అందిస్తోంది. ఒకటి స్టాండర్డ్ కాగా మరోటి లాంగ్ రేంజ్‌ని కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం 5 ట్రిమ్స్ ఉన్నాయి. స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+. సన్‌రూఫ్ మరియు నాన్-సన్‌రూఫ్ వేరియంట్‌లు ఉన్నాయి. 3.3kW వాల్‌బాక్స్ ఛార్జర్ లేదా 7.2kW ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌ని ఎంచుకోవచ్చు. Tata Punch.ev ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు.