Vivek Ramaswamy: అయోవా స్టేట్ ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేస్తు్న ట్రంప్‌కి మొదటి విజయం దక్కింది. మరోవైపు ఇదే పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు రామస్వామి తెలిపారు.
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు ఏదైనా చేస్తా అని వివేక్ రామస్వామి అన్నారు. తన ప్రచారం మొత్తం నిజం గురించి జరిగిందని, అమెరికా ఫస్ట్ అనే దేశభక్తుడు అధ్యక్షుడు కావాలని, తాను డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు తెలుపుతున్నానని, తదుపరి యూఎస్ ప్రెసిడెంట్ అని నిర్థారించుకునేందుకు తాను చేయగలిగినదంతా చేస్తా అని సోషల్ మీడియా వేదికగా వివేక్ రామస్వామి చెప్పారు.
Read Also: IT Employees Layoffs 2024 : 2024లో 50 వేల మంది ఉద్యోగులను తొలగించిన టాప్ 4 కంపెనీలు..
అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. ఇందులో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందినవారు. మంగళవారం సాయంత్రం న్యూ హాంప్ షైర్‌లో జరిగే ర్యాలీలో ట్రంప్‌తో కలిసి పాల్గొనాలని యోచిస్తున్నట్లు బయోటెక్ వ్యవస్థాపకుడైన వివేక్ రామస్వామి చెప్పారు. ఆయన మన దేశం గురించి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. ట్రంప్ విజయానికి ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశానని అన్నారు.
అయోవా విజయం ట్రంప్‌కి పెద్ద బూస్ట్‌ని ఇచ్చింది. వరస కేసులను ఎదుర్కొంటున్నప్పటికీ మరోసారి తాను అధ్యక్షుడిని కావాలని ట్రంప్ అనుకుంటున్నారు. గతంలో ట్రంప్‌పై పలుమార్లు వివేక్ రామస్వామి ప్రశంసలు కురిపించారు. యూఎస్ క్యాపిటల్ ఘటనలో ట్రంప్‌కి మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను యూఎస్ అధ్యక్షుడినైతే ట్రంప్‌పై ఉన్న అన్ని ఆరోపణలకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని చెప్పారు. తాను చూసిన గొప్ప అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరని పొగిడారు.