Maruti Suzuki: దేశంలో అగ్రశ్రేణి కార్ మేకర్ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. తన అన్ని కార్ మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. 0.45 శాతం ధరల్ని పెంచింది. కార్ల డిమాండ్ మందగించిస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వస్తువుల ధరల కారణంగా జనవరి నుంచి ధరలు పెంచాలని యోచిస్తు్న్నట్లు మారుతీ 2023 చివర్లో ప్రకటించింది. ఒక్క మారుతీనే కాకుండా మిగతా కార్ కంపెనీలు కూడా ఇదే తరహాలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Rahul Gandhi: రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమం ‘మోడీ ఫంక్షన్’గా అభివర్ణించారు. జనవరి 22న తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చాయని, ఇడి బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్లనని చెప్పారని అన్నారు.
DGCA: పొగమంచు, వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై దెబ్బ పడింది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టు, విమానాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలస్యం వల్ల పలువురు ప్రయాణికులు అసహనంతో ఎయిర్ లైనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి వరస ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) సోమవారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) జారీ చేసింది.
Flight delay: పొగమంచు కారణంగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విమానాల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అవుతుందని ప్రకటించిన కెప్టెన్‌పై ప్రయాణికుడు అసహనంతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేంద్రం విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 100 విమానాలు ఆలస్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు తమ విమానం ఎప్పుడు ఎగురుతుందో చెప్పాలని…
Gutkha: గుట్కా ఒక యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. తన భార్య వేరే వ్యక్తి నుంచి గుట్కా తీసుకుందని, అసూయపడిన భర్త తన గొంతు, మణికట్టును కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ బేతల్ జిల్లాలో గౌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. భారతదేశం-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు సమీక్షించారు.
Indian Fishermen: శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం ఇలాగే 12 మందిని అరెస్ట్ చేసింది. శ్రీలంక జాఫ్నాలోని పాయింట్ పెడ్రోకి ఉత్తరాన ఆదివారం నాడు మత్స్యకారుల్ని అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. పట్టుబడిన పది మంది మత్స్యకారులను కంకేసంతురై హార్బర్‌కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం మైలాడి ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని తెలిపారు.
Mahindra XUV700: భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్న కార్లలో మహీంద్రా XUV700 ఒకటి. తాజాగా 2024 మహీంద్రా XUV700 SUVని కంపెనీ ఈ రోజు లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే లుక్స్, ఫీచర్ల పరంగా మరింత స్టైలిష్‌గా వస్తోంది. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అప్డేట్స్ చోటు చేసుకున్నాయి. కొత్తగా నాపోలి బ్లాక్ కలర్ ఛాయిస్ కూడా ఉంది. భారత్‌లో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో మహీంద్రా XUV700 ఒకటి. 2023లో మహీంద్రా XUV700 కార్ 74,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. […]
Ram Bhajan: యావత్ దేశం రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఈ మహాత్తర ఘట్టం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రామ మందిర వేడుకకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది దేశవ్యాప్తంగా పండగ వాతావరణ నెలకొంది.
Ram Lalla idol: కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్నారు. కృష్ణ శిలలతో చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం సోమవారం ధృవీకరించింది. ఈమేరకు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అంతకుముందు రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం అరుణ్ యోగి రాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేస్తామని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చెప్పారు. తాజాగా టెంపుట్ ట్రస్ ఇదే విషయాన్ని…