Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘‘ఆర్ఎస్ఎస్‌కి చోటా రీఛార్జ్’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఢిల్లీలో సుందరాకాండ పారాయణం చేయాలని ఆప్ నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ఓవైసీ విమర్శించారు.
Read Also: Rahul Gandhi: రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు వెళ్లదో చెప్పిన రాహుల్ గాంధీ..
‘‘ ప్రతీ నెల మొదటి మంగళవారం ఢిల్లీలోని ప్రతీ నియోజకవర్గంలో సుందరాకాండ పారాయణం చేయాలని ఆర్ఎస్ఎస్ చోటా రీఛార్జ్ నిర్ణయించింది. జనవరి 22న (రామమందిర) ప్రారంభోత్సవం కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ట్వీట్ చేశారు. ‘‘బిల్కిస్ బానో విషయంలో కొందరు వ్యక్తులు మౌనంగా ఉన్నారు. విద్యా, ఆరోగ్య వంటి సమస్యలపై మాత్రమే మాట్లాడాలని అనుకుంటున్నాను. సుందరాకాండ విద్యా లేదా ఆరోగ్యమా..? అసలు విషయం ఏంటంటే వారు న్యాయానికి భయపడుతున్నారు. సంఘ్‌కి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మనం బాబ్రీ గురించి మాట్లాడం, మీరు నీతి, ప్రేమ అనే ఫ్లూట్ వాయిస్తూనే ఉంటారు.. అదే సమయంలో హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ ఉండండి.. వావ్’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆప్ హిందుత్వ రాజకీయాలను చేస్తోంది.. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆప్‌కి మధ్య తేడా ఏంటి? అని ఓవైసీ ప్రశ్నించారు.
ఓవైసీ వ్యా్ఖ్యలపై ఆప్ కూడా అంతే స్థాయిలో మండిపడింది. ఢిల్లీ సీఎంకి ఏ నాయకుడి సర్టిఫికేట్ అవసరం లేదని ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ రాముడి భక్తుడు, ఏదైనా కొత్త పని ప్రారంభించే సమయంలో ఆయన ప్రభు రాముడు, హనుమాన్ ఆశీర్వాదం తీసుకుంటారు అని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తన మతాన్ని నమ్ముతాడని అన్నారు.