Gurmeet Ram Rahim Singh: అత్యాచారం, హత్య దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)కి మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 50 రోజలు పాటు పెరోల్ లభించింది. గత నాలుగేళ్లలో ఆయనకు పెరోల్ రావడం ఇది 9వ సారి. అని పెరోల్ పొడగింపుకు హర్యానా సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్‌లోని సునారియ జైలులో ఉన్నాడు. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబర్‌లో ఆయనకు 21 రోజల పెరోల్ మంజూరైంది.
Read Also: Mallareddy : దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి..
రామ్ రహీమ్‌కి గతం 24 నెలల్లో పెరోల్ లభించడం ఇది 7వ సారి, ఈ ఏడాది 5వ సారి. అంతకుముందు, హర్యానా పంచాయితీ ఎన్నికలు మరియు అడంపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు అతను అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. శిక్ష పడిన తర్వాత మొదటిసారిగా అక్టోబర్ 24, 2020న పెరోల్ తొలిసారి పొందాడు. 2017లో ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే అత్యాచారం, హత్యల్లో దోషిగా ఉన్న వ్యక్తికి శిక్ష పడిన మూడేళ్ల వ్యవధిలో 9 సార్లు, 234 రోజుల పాటు పెరోల్ దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ డేరాబాబా పెరోల్‌ని సమర్థించారు. ‘రామ్ రహీమ్‌కు పెరోల్ వచ్చిందని నాకు తెలియదు. కానీ అతను పెరోల్ పొందినట్లయితే, అది అన్ని విధానాలను అనుసరించి ఉండాలి, అది అతని హక్కు. నేను అందులో జోక్యం చేసుకోను’ అని ఆయన అన్నారు.