Israel: గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.
Read Also: Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు మరోసారి పెరోల్.. నాలుగేళ్లలో 9వ సారి..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఇదిలా ఉంటే.. తాజాగా ఇజ్రాయిల్ గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయిల్‌ని యునైటెడ్ స్టేట్స్ జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌ని వివరణ కోరినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ, ఈ విషయంపై మరింత వ్యాఖ్యానించడానికి తన వద్ద తగినంత సమాచారం లేదని, అయితే హమాస్ తన సైనిక అవసరాల కోసం ప్రజల మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తుందని ఆరోపించారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది. ఆ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. హమాస్ మిలిటెంట్లు, ఇతర నాయకులకు ఇది కంచుకోటగా ఉంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో 1200 మంది ప్రజలు మరణించారు. 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. పాలస్తీనాలో 24,620 మంది ప్రజలు చనిపోయారు.
Birzeit University condemns the brutal assault and bombing of @Al-Israa University campus by the Israeli occupation south of #Gaza city, this occurred after seventy days of the occupation occupying the campus; turning it into their base, and military barracks for their forces pic.twitter.com/vot9s1z3tz
— Birzeit University (@BirzeitU) January 18, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!