Simultaneous Polls: వన్ నేషన్-వన్ ఎలక్షన్ కోసం కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది.
Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
Snoring: బిగ్గరగా "గురక" పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.
Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Iran: మొన్నటి వరకు ఉత్తర కొరియా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలకు సవాల్ విసురుతూ.. శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపగా, తాజాగా ఇరాన్ తన శాటిలైట్ ‘సొరయా’ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) ఆంక్షలను ధిక్కరించి ప్రయోగాన్ని చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సోరయా శాటిలైట్‌ని భూ ఉపరితలం నుండి 750 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.
Maharashtra: మహారాష్ట్ర బీడ్ జిల్లాలో లింగమార్పిడి చేయించుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మగబిడ్డకు తండ్రయ్యాడు. మజల్ గావ్ తాలుకాలోని రాజేగావ్కి చెందిన లలిత్ కుమార్ సాల్వే జనవరి 15న మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ఇతను 2020లో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని పురుషుడిగా మారాడు. ఆ తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురించి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం ఎదురుదాడి ప్రారంభించారు.
Butter Chicken: బటర్ చికెన్.. ఈ పేరు మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ రెసిపి ఇండియాలోనే మొదలైనప్పటికీ.. దాని టేస్ట్ మాత్రం ప్రపంచానికి చేరింది. తాజాగా ఈ వంటకం కోసం రెండు రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. బటర్ చికెన్‌తో పాటు దాల్ మఖ్కీ తామే కనిపెట్టామనే ట్యాగ్ వాడుకోవడంపై మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు ఫైట్ చేస్తున్నాయి.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమైంది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు 7000 మందికి పైగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షల్లో ప్రజలు ఇప్పటికే అయోధ్యకు వెళ్లే మార్గాల్లో ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం గంట పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.