Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.
Beangal Rape case: బెంగాల్ మెడికల్ విద్యార్థిని అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెతన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన సమయంలో, ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈకేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. బాధితురాలు తన వాగ్మూలంలో తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు నిందితుడు అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆమె తండ్రి తన ఫిర్యాదులో అతడి పేరును కూడా పేర్కొన్నాడు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్.
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. Read Also: Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Bengal Rape Case: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న యువతి తన స్నేహితుడి కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్‌కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి మృతదేహాన్ని ఇజ్రాయిల్‌కు తిరిగి ఇచ్చారు.
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్‌లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్‌గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Operation Sindoor 2.0: పాకిస్తాన్, భారత్‌పై మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాల్పడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని భారత్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత ప్రమాదకరంగా మారుతుందని పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ భారత్ వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C), లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మంగళవారం అన్నారు. జమ్మూ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.